Junk Food : మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా…? ఇలా చేసి దూరం చేయండి
ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.
Junk Food : ఈ కాలం పేరెంట్స్ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు. అన్నం తక్కువ తింటూ జంక్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు. అదే వైఖరి వయస్సు పెరిగేకొద్ది జంకు ఫుడ్స్ కారణంగా బరువు పెరుగుతారు. అది మీకు, మీ పిల్లల భవిష్యత్‌కు నష్టాలను తెచ్చిపెడుతుంది. మీ పిల్లలను ఆరోగ్యకరమైన ఆహారం వైపు మళ్ళించడానికి ఈ టిప్స్ ను ప్రయత్నించండి.
మీరే ఒక ఉదాహరణగా నిలవాలి
మీ పిల్లలను చెడు ఆహారపు అలవాట్లకు దూరంగా ఉంచాలంటే, ముందుగా మీరు వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు చేసే పనులను పిల్లలు ఎప్పటికప్పుడూ గమనిస్తుంటారు. అంతేకాక మిమ్మల్నే వారు అనుకరిస్తుంటారు. జంక్ ఫుడ్ తినడం, ఎక్కువ సేపు ఫోన్లో గడపడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించకపోవడం వంటి వాటిని చూసి మీ నుండి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి, ముందుగా మీరు వాటికి దూరంగా ఉండి, మీరే వారికి ఉత్తమ ఉదాహరణగా నిలువండి.
చిరుతిళ్లకు దూరంగా ఉంచండి
చాలా మంది పిల్లలు ఇంట్లో వండిన ఆహారం కంటే బయట చిరుతిళ్లు తినడానికే ఇష్టపడుతుంటారు. దీన్ని మీరు ప్రోత్సహిస్తే మీ పిల్లలు అనారోగ్య భారీన పడే ప్రమాదం ఉంది. ఒకవేళ వారికి స్కాక్స్ తినిపించాలి అనుకుంటే అనారోగ్యకరమైన స్నాక్స్ బదులు మీరే రుచికరమైన, -ఆరోగ్యకరమైన స్కాక్స్ ను తయారు చేసి వారికి ఇవ్వండి. అంతేకాక, పిల్లలు క్రమం తప్పకుండా భోజనం చేసేలా చూడండి.
ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చండి
మీ పిల్లలకు ఇష్టమైన వంటకంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చండి. దీంతో తమకు ఇష్టమైన వంటకంలా భావించి దాన్ని ఆరగిస్తారు. ఉదాహరణకు, బర్గర్ ప్యాటీలో సోయాతో పాటు బంగాళాదుంపలను చేర్చడం, పాలలో డ్రైఫ్రూట్స్, విత్తనాలను చేర్చడం వంటివి చేయండి. ఇవి మీ పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి.
కఠినంగా వ్యవహరించకండి
మీ పిల్లల మెరుగైన ఆరోగ్యానికి సహకరించే పదార్థాలను ప్రతిరోజు భోజనానికి ముందు ఇవ్వండి. అంతేకాక, మీ పిల్లల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించకండి. వారితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వారి చెడు ఆహారపు అలవాట్లను మాన్పించేలా ప్రయత్నించండి.
ఆరోగ్య ప్రాముఖ్యతను తెలియజేయండి
ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను మీ పిల్లలకు తెలియజేయడం చాలా ముఖ్యం. వారు పుస్తకాలలో కన్నా మీ నుండే ఎక్కువ విషయాలు నేర్చుకుంటారని గమనించండి. సరిగ్గా కూర్కోవడం, రాత్రి పూట పడుకునే ముందు బ్రష్ చేయడం, సరైన నిద్ర వంటివి వారికి అలవాటు చేయండి.
జంక్ ఫుడ్‌కు అలవాటు పడ్డ పిల్లలను వాటి నుంచి దూరం చేయడం చాలా కష్టం. దీని వల్ల పిల్లలు బరువు పెరిగితే.. ఇంట్లో చిన్న చిన్న పనులను పిల్లలతో చేయించాలి. దగ్గరలోని ప్రాంతానికి వెళ్లేటప్పుడు కార్లు లేదా బైక్‌లపై తీసుకెళ్లకుండా నడిపించుకుని తీసుకెళ్లాలి. అపార్ట్మెంట్లలో లిఫ్ట్ ఉన్నా.. అది వాడకుండా మెట్ల మార్గం ద్వారా తీసుకెళ్లడం, పిల్లలు ఆసక్తి చూపించే క్రికెట్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ లాంటి ఆటలను ఆడించాలని చెప్పారు. ఇక డ్యాన్స్ లాంటివి నేర్పించడం వల్ల పిల్లల్లో శారీరక శ్రమ పెరుగుతుందని, దీని వల్ల బరువు తగ్గుతారు. ఒకవైపు శారీరక శ్రమ పెంచుతూనే.. మరోవైపు పిల్లలు తినే ఆహార మోతాదును తగ్గించడం, ఆహారంలో కొవ్వు పదార్థాలను తక్కువగా అందించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల స్థూలకాయం నుంచి బయట పడేయవచ్చు.