NLR: సనాతన ధర్మం పేరుతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిపట్ల జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక న్యాయవాది తన బూటును విసిరి సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటూ మాట్లాడిన ఘటనను ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఆ లాయర్‌ను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.