KRNL: వైసీపీ టాక్స్ – కర్నూల్ యూట్యూబ్ ఛానల్ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బటన్ నొక్కారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.