KRNL: ప్రధాని మోదీ కర్నూలు పర్యటనకు సంబంధించి ఇవాళ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు రావాల్సిన డీజీపీ హరీశ్ కుమార్ పర్యటన అనివార్య కారణాలతో రద్దయిందని అధికారులు తెలిపారు. దీంతో ఏర్పాట్లను పరిశీలించేందుకు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మాధవరెడ్డి ఇవాళ జిల్లాకు రానున్నారు. ఆయన రాగమయూరి సభా స్థలం, ఎయిర్పోర్టు ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.