AP: పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టాక మారిపోయారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సుగాలిప్రీతి తల్లి రోడ్డెక్కి ఆక్రోశిస్తున్నా, ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ఆ అంశాలపై తనదైన శైలిలో పవన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అలాగే, కూటమి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం విక్రయాలతో చంద్రబాబు చివరకు మందుబాబులకు సైతం వెన్నుపోటు పొడిచారని అన్నారు.