దర్శక దగ్గజం జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అవతార్ 2’ టైం స్టార్ట్ అయిపోయింది. అవతార్ మూవీలో పండోరా అనే కొత్త ప్రపంచాన్ని చూసిన జనం.. అవతార్ 2లో అండర్ వాటర్ విజువల్స్ చూసేందుకు తహతహలాడుతున్నారు.
ఈ సినిమా పై ఉన్న అంచనాలు.. ఊహకందని విధంగా ఉన్నాయి. అదుకే అవతార్ 2 బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2.7 బిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లు సాధించడంతో.. సీక్వెల్‌ను అంతకు మించే బడ్జెట్‌తో తెరకెక్కించారు. అందుకు తగ్గట్టే బిజినెస్ విషయంలో తగ్గేదేలే అంటోందట ఈ క్రేజీ మూవీ. లేటెస్ట్ అప్టేట్ ప్రకారం..
ఒక్క థియేట్రికల్ బిజినెస్ పరంగానే.. ఓవరాల్‌గా అన్ని దేశాల్లో కలిపి 2 బిలియన్ బిజినెస్ జరిగిందట. ఈ లెక్కన దాదాపు అప్పట్లో అవతార్ వసూళ్లు చేసిన రేంజ్లో అవతార్ 2 బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. ఇదే నిజమైతే.. అవతార్ 2 భారీ టార్గెట్ ఫిక్స్ అయిందనే చెప్పాలి. అందుకే ‘అవతార్.. ది వే ఆఫ్ వాటర్’ టికెట్ రేట్లు దిమ్మ తిరిగేలా ఉన్నాయని అంటున్నారు.
ప్రస్తుతం బెంగళూరులో ఈ సినిమా టికెట్ రేట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 1000 నుంచి.. 1400 రూపాయలు వరకు టికెట్ రేట్లు ఉన్నాయని అంటున్నారు. మిగతా రాష్ట్రాల్లోను అదే రేంజ్లో ఉందంటున్నారు. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో అవతార్ టికెట్ల విషయంలో క్లారిటీ రాలేదు.
కానీ ఇక్కడ కూడా రేట్లు గట్టిగానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా అవతార్ ఓపెనింగ్స్ ఊహించని విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా అవతార్ 2 థియేటర్లో చూడాలంటే.. సామాన్యులకు కష్టమేనని అంటున్నారు.