BDK: సుప్రీంకోర్టు జస్టిస్ బీఆర్ గవాయ్ పై న్యాయవాది రాజేశ్ కిషోర్ దాడి చేయడాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ఖండించారు. అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులు తీర్పులివ్వడం, వ్యాఖ్యానాలు చేసే వైఖరి ఉంటుందని తెలిపారు. మతోన్మాదులకు అనుకూల తీర్పులు ఇవ్వరని చెప్పారు.