VZM: విజయనగరం శ్రీ పైడితల్లమ్మ సినిమానోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణతో రాష్ట్రంతో పాటు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్ వేదికగా పైడితల్లి అమ్మవారి ఫోటో పెట్టి లోకేష్ ఆకాంక్షించారు.