BDK: ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం ప్రకారం 100 శాతం సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు అన్ని ఆదివాసీలకే రిజర్వ్ చేయబడ్డాయని ఆదివాసి జేఏసీ కన్వీనర్ వాసం రామకృష్ణ దొర అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదివాసీలు సత్తా చాటాలని సోమవారం ములకలపల్లి మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తదితర నాయకులు పాల్గొన్నారు.