ASF: జిల్లా కౌటాల మండలంలోని ముత్తంపేట్ గ్రామంలో సోమవారం పిడుగుపాటుతో బెండరే శ్యామ్ రావ్ అనే రైతుకు చెందిన రూ. 80 వేల విలువైన రెండు ఎద్దులు మృతి చెందాయి. మెరుపులతో కూడిన పిడుగుపాటుకు గురైన ఎద్దులు ప్రాణాలు కోల్పోవడంతో రైతు శ్యామ్ రావ్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.