AKP: బల్క్ డ్రగ్ పార్క్ పార్కుకు వ్యతిరేకంగా రాజయ్యపేటలో మత్స్యకారులు చేపట్టిన రిలే దీక్షలు సోమవారం 23వ రోజుకు చేరుకున్నాయి. రిలే దీక్షలకు మద్దతు పలుకుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తుండడం పట్ల మత్స్యకారులు నిరసన వ్యక్తం చేశారు. ఇది పాలకులకు తగదన్నారు. బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటయితే మత్స్యకారుల ఉనికి దెబ్బతింటుందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.