NZB: నవీపేట్ మండలం మద్దేపల్లిలో సోమవారం ప్రమాదవశత్తు మృతి చెందిన వానరానికి యువకులు అంత్యక్రియలు చేశారు. మృతి చెందిన వానరాన్ని గమనించిన కొంతమంది యువకులు అడవి జంతువులు, పక్షులు ప్రకృతిలో భాగమని వాటికి కూడా గౌరవ ప్రదమైన అంత్యక్రియలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, భుమేష్, రాజు, రెడ్డి సాయిలు రాజేశ్వర్ పాల్గొన్నారు.