HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. HYDలో పార్టీ గుర్తుపై గెలిచిన MLA లేకపోవడంతో ఇక్కడ గెలిచి బోణీ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే వార్డుకో మంత్రిని ఇన్ఛార్జీగా నియమించాలని PCC నిర్ణయించింది. వీధికో ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని సూచించి, జాబితా రెడీ చేశారు.