ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని చీరాల రహదారిలో సోమవారం కారు, బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నాగులుప్పపాడు మండలం టి. అగ్రహారానికి చెందిన అశోక్(25)గా పోలీసులు గుర్తించారు. వ్యక్తిగత పనులపై అశోక్ ఒంగోలు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.