GNTR: తెనాలిలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం,ఉరుముల ధాటికి విద్యుత్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. బుర్రిపాలెం,యడ్లలింగయ్య కాలనీ సమీపంలోని పొలాల గుండా పట్టణానికి విద్యుత్ సరఫరా చేసే మెయిన్ లైన్లలోని ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఈ నష్టాన్ని గుర్తించిన వెంటనే 50 మందికి పైగా సిబ్బంది రాత్రంతా పని చేశారు.