MLG: వెంకటాపురం మండలం పాత్రపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నరేష్ (30) ఇవాళ ఉదయం ఇంట్లోని ఫ్రిజ్ నుంచి వాటర్ బాటిల్ తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.