VZM: మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం శ్రీ పైడితల్లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారిణి శిరీష ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వేదపండితులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. పండగ ఏర్పాట్లపై ఆలయ ఈఓ శిరీషని అడిగి తెలుసుకున్నారు.