VSP: విశాఖపట్నంలోని సంయుక్త మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవాన్ని ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ వేడుకలో 60 మందికి పైగా శిష్యులు అద్భుతమైన కూచిపూడి నృత్యవిన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గనబాబు పాల్గొన్నారు.