NLG: నల్గొండ పట్టణం పెద్దబండకు చెందిన జక్కల మల్లేష్ రోడ్డు ప్రమాదానికి గురై హయత్‌నగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం వల్ల బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్ చేయాల్సి ఉంది. విషయం తెలుసుకున్న నకిరేకల్‌కు చెందిన లిటిల్ సోల్జర్స్ ప్రతినిధులు ఆదివారం మల్లేష్ తల్లికి రూ. 15,200 లు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.