KMR: కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద నీటి ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.