BDK: భద్రాచలం పట్టణంలో తెలంగాణ ఆదివాసి TAGS నాయకులు ఆదివారం సమావేశమయ్యారు. జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు రిజర్వేషన్ అమలు చేయొద్దని, 5వ షెడ్యూల్ ప్రాంతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు కూడా గిరిజనులకే రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు.