KMM: మధిరలో ఆదివారం ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. 21వ వార్డుకు చెందిన వెంపాటి రాజేంద్రప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఖమ్మం వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దుండగులు బీరువాను పగలగొట్టారు. 12 గ్రాముల బంగారం, నాలుగు బియ్యం బస్తాలు, నాలుగు ఇత్తడి కాగులు, రూ.10 వేల నగదు, విలువైన బట్టలు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు.