KRNL: దేవరగట్టులో బన్ని ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసిల క్రీడలు వైభవంగా జరగనున్నాయని ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. రాష్ట్రం నలుమూలలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులను గొరవయ్యల నృత్యాలు మంత్రముగ్ధులను చేస్తాయి. సాయంత్రం వసంతోత్సవం, పల్లకీ కంకణ విసర్జన ఆలయానికి చేరడంతో సోమవారం ఉత్సవాలు ముగుస్తాయి.