బాలీవుడ్ సినీయర్ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ‘అమర్ భూపాలి’ అనే మరాఠీ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆమె పలు మరాఠీ, హిందీ సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అద్భుతమైన నటనతో పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల నాట్య ప్రదర్శన ఆమె సొంతం. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.