కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా దెందులూరు (Dendulur) మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శింగవరం గ్రామంలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా దెందులూరు (Dendulur) శివగవరం గ్రామంలో దారుణం జరిగింది. భీమడోలు మండలం గుండుగొలనులో ఓ విందు జరిగింది. అయితే ఆ ఫంక్షన్లో మిగిలిపోయిన మటన్ బిర్యానీ(Mutton Biryani)ని శింగవరం గ్రామానికి చెందిన పలువురు పేదలకు పంపిణీ చేశారు. అయితే ఆహారం తిన్న వారంతా వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధితులకు స్థానిక ఆర్ఎంపి కొంత మందికి చికిత్స అందించారు. అయితే బాధితుల సంఖ్య మరింత పెరగడంతో గ్రామస్థులు 108కు సమాచారం అందించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన 13 మందిని హుటాహుటిన ఏలూరు(Elur) ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వీరిలో పది మంది చిన్నారులు, ఓ గర్భిణి, ఇద్దరు పురుషులు ఉన్నారు. మరో నలుగురికి ఇంటి వద్దే వైద్యం అందించారు. ప్రస్తుతం వీరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు (Doctors) వెల్లడించారు. మటన్ బిర్యాని వల్లే సమస్య వచ్చిందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి (MLA Abbayya Chowdhury)పరామర్శించారు. ఏలూరు ఆర్‌డిఒ (RDO) పెంచల కిషోర్‌కుమార్ వైద్యాధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శుక్రవారం ఆస్పత్రిలో మరికొంతమంది చికిత్సపొందుతున్నారు.