ADB: వర్షాకాలం నేపథ్యంలో అంటు రోగాలు ప్రబలకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిల్ రాజ్ అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో భీంపూర్ మండల కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది గర్భిణీ స్త్రీలు, శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి టీకాలను అందజేశారు.