VZM: ఇటీవల కొంతమంది అమాయకులైన యాదవులపై దాడులు చేసి, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్ర అఖిలభారత మహాసభ ప్రధాన కార్యదర్శి దేవర ఈశ్వరరావు శనివారం అన్నారు. ముచ్చర్ల గ్రామంలో గత నెల 24న రంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిని తీవ్రంగా దాడి చేసి కొట్టి అవమానించారని తెలిపారు. ఇటువంటి వారిపై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.