ప్రకాశం: కనిగిరి జనసేన పార్టీ నాయకులు దేవకి వెంకటేశ్వర్లు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తనకు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఉగ్రకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలం ఆలయ పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానన్నారు.