MDK: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొందరూ నాయకులు బంధుత్వాలు కలుపుతూ ప్రచారం చేస్తున్నారు. నిన్నటి వరకు అసలు కన్నెత్తి చూడని నాయకులు అన్న, తమ్ముడు, బావ, అక్క, చెల్లి, బాబాయ్ అంటూ వరుసలు కలుపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 9న విడుదల అవుతున్న నేపథ్యంలో ఇలా వరుసలు కలుపుతున్నారని, ఇలాంటి బంధుత్వాలు కలుపుకోవడం నాయకులకు పరిపాటే అని ఓటర్లు అంటున్నారు.