AP: CM చంద్రబాబు మంత్రులకు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడారు.. వారిని నియంత్రించాల్సిన బాధ్యత ఇంఛార్జ్ మంత్రులదేనని అన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లోనూ విజయవాడ ఉత్సవ్ తరహాలో ఈవెంట్లు పెట్టాలని సూచించారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా నెలకో ఈవెంట్ పెట్టాలన్నారు.