TG: కంచన్ బాగ్కు చెందిన మహ్మద్ అజీమ్, షబానా బేగం దంపతులకు సుమ్మయా(7) కుమార్తె ఉంది. ఆమె మంగళవారం మాదన్నపేట చావనీలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే రాత్రి బాలిక కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల తనిఖీల్లో అమ్మమ్మ ఇంటిపై వాటర్ ట్యాంక్లో బాలిక శవం కనిపించింది. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.