MBNR: చిన్నచింతకుంటకు చెందిన విద్యార్థిని జొన్న రేచల్ MBBSలో సీటు సాధించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబ పరిస్థితిని MLA మధుసూదన్ రెడ్డి దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆమె కాలేజీలో చెల్లించాల్సిన ఫీజు రూ.50వేలు శుక్రవారం అందజేసి చేయూతనిచ్చారు. ఉన్నత చదువుల నిమిత్తం భవిష్యత్తులో తన సహాయ సహకారాలు ఉంటాయని MLA హామీ ఇచ్చారు.