GNTR: ట్రాఫిక్, మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పట్టాభిపురం, భాగ్యనగర్, తుఫాన్ నగర్, మారుతీనగర్ ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం నీరు డ్రైన్లలో సక్రమంగా వెళ్లకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలిగించే ఆక్రమణలు ఉండకూడదన్నారు.