KKD: రంగవల్లి నగర్ కాలనీలోకి అక్రమంగా చొరబడి, ఏరుకల కులానికి చెందిన వారిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం జగ్గంపేట ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం మండల తహశీల్దార్, మెజిస్ట్రేట్‌కి వినతిపత్రం అందజేశారు.