NLG: నకిరేకల్ మున్సిపాలిటీ 15వ వార్డుకు చెందిన AK జిలానీ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో శుక్రవారం MLA వేముల వీరేశం జిలానీ ఇంటికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ప్రమర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ వెంకన్నతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.