అన్నమయ్య: రైల్వే కోడూరులో శుక్రవారం GST 2.0 అవగాహన కార్యక్రమం జరిగింది. వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, యూరియా వంటి వాటిపై GST 12% నుంచి 5%కి తగ్గించడాన్ని ప్రజలు హర్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతులకు మద్దతు తెలిపారు. ముక్కా సాయి వికాస్ రెడ్డి, ఎన్డీఏ నేతలు, అధికారులు, రైతులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.