NLG: నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసరంగా రక్తం కావాల్సిన రోగిని నల్గొండ తాహసీల్దార్ కే.పరుశురాం ఆదుకున్నారు. శుక్రవారం ఓ రోగికి రక్తం అవసరమని సమాచారం తెలియగానే ఆయన స్పందించి ఆసుపత్రికి వెళ్లి రక్త దానం చేశారు. ఓ అధికారి స్వయంగా వచ్చి రక్తదానం చేయడంపై రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.