అమెరికా విశ్వవిద్యాలయాలకు ఇండో-అమెరికన్లు భారీగా విరాళాలు ఇస్తున్నట్లు ఇండియాస్పోర సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 2,70,000 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారని తెలిపింది. వీరి నుంచి ఆ దేశానికి 10 బిలియన్ డాలర్లు (రూ.83 వేల కోట్లు) లభిస్తోందని చెప్పింది. 2008లో ఇండో-అమెరికన్లు అక్కడి విశ్వవిద్యాలయాలకు మొత్తం రూ.25,000 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.