AP: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో CM చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ప్రమాదాలతో నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే ఇవాళ సాయంత్రంలోగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరించాలని తెలిపారు.