KMM: మధిర ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని సమక్షంలో నారాయణపురం గ్రామానికి చెందిన కొంగల శ్రీనివాసరావు , దుడ్డు వెంకటేశ్వర్లు, దుడ్డు సాంబయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరివేద సుధాకర్ ఉన్నారు.