ATP: కళ్యాణదుర్గం రిపోర్టర్ ఇషాక్ అనారోగ్యానికి గురికావడంతో స్థానిక మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి విషయం తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సొంత నిధులతో ఇషాక్ చికిత్సకు సహాయం చేసి ఆరోగ్యంగా ఇంటికి చేరేలా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్య వేదిక నాయకులు ఎమ్మెల్యేను కలిసి సన్మానం చేశారు.