GNTR: గుంటూరు జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గి రైతులకు లాభదాయకత పెరగేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రాథమిక రంగాల శాఖల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ క్రాప్ పాటర్న్ మ్యాపింగ్, స్థూల విలువ ఆధారిత పెంపు కోసం కృషి చేయాలని సూచించారు.