ADB: తలమడుగు మండలంలో రైలు పట్టాలపై మృత దేహం కలకలం రేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ఉండం గ్రామానికి చెందిన హర్షముక్తుల వెంకటి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి ఆ గ్రామ సమీపంలో ఉన్న రైల్వే పట్టాల్లో శవమై తేలాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.