KRNL: ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక రథోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు చేసి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.