AP: ఎగువన కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజ్ నుంచి 1.04 లక్షల క్యూసెక్కుల వరదను వదిలి, మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్ సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు.