కోనసీమ: గోపాలపురం నుంచి రావులపాలెం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేస్తూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు జీఎస్టీ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి టీడీపీ ఇంచార్జి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు సూపర్ గిఫ్ట్ ద్వారా అవకాశం కల్పించిందన్నారు. వ్యవసాయ రంగ వస్తువులపై జీఎస్టీ 12% నుంచి ఐదు శాతానికి తగ్గించారన్నారు.