SDPT: కుకునూర్ పల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి హైదరాబాద్కు బైకుపై వెళ్తున్న కామినేని ప్రభుదేవా అనే వ్యక్తి, కుకునూర్ పల్లి శివారులో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో అతన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.