JGL: ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామ శివారులో గల భీమన్న దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మహీంద్రా కారు పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్న విద్యుత్ పోల్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.