SKLM: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో జిల్లా వ్యాప్తంగా గురువారం గాలులతో కూడిన వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో నివ్వడం వద్ద వాటర్ ఫ్లడ్ ఏర్పడింది. దీంతో స్థానిక యువకులంతా ఏకమై ఇసుక బస్తాలని ఏర్పాటు చేసి, కాలువ వద్ద గట్టును శుక్రవారం కట్టారు. స్థానిక యువత స్ఫూర్తిని చూసి స్థానిక ప్రజలు అభినందనలు తెలిపారు.