BHPL: భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం SP కిరణ్ ఖారే మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజలు రూ.50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లేందుకు అనుమతి ఉందన్నారు. సరైన పత్రాలు లేని రూ. 50 వేలు దాటిన నగదును సీజ్ చేస్తామని హెచ్చరించారు. అక్రమ నగదు రవాణాపై నిఘా కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని SP తెలిపారు.